మంది ప్రజలు కాంగ్రెస్ అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రతిజ్ఞ తీసుకున్నారు

క్యాంపైన్ నినాదం

కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి కల్పించడమే మా లక్ష్యం

క్యాంపైన్ నినాదం

కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి కల్పించడమే మా లక్ష్యం

కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు పాలన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేస్తోంది! విచ్చలవిడిగా, అడ్డూ అదుపులేని అవినీతితో రాష్ట్ర ఆర్థిక సుస్థిరతను ధ్వంసం చేయడంలో రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి కీలక పాత్ర పోషించారు.
రాష్ట్రం దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది! మహిళల భద్రతే పెద్ద సమస్యగా మారింది. మరోవైపు రేవంత్ రెడ్డి అసమర్థతే యువత జీవితాలను నాశనం చేస్తోంది. మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో ముందంజలో ఉంది.
6 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి తప్పుడు హామీలు ఇచ్చి, ఇప్పుడు పింఛన్లు పెంచడంలో, పంట రుణాలను మాఫీ చేయడంలో విఫలమై రాష్ట్ర రైతులను విపత్కర పరిస్థితుల్లోకి నెట్టారు.
అందుకే ఇప్పుడు కోట్లాది మంది ప్రశ్నిస్తున్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కాంగ్రెస్ దుర్మార్గపు పాలనను ప్రశ్నిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. మీరు సైతం ఇప్పుడే ఈ ఉద్యమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి పాలన నుంచి తెలంగాణను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేయండి.

క్యాంపైన్ పాట

video icon

స్కాంగ్రెస్ నేతల గురించి తెలుసుకునేందుకు...

result image

షేర్ చేయండి

డౌన్‌లోడ్ చేయండి

ఫలితాలను చూసేందుకు మీ మొబైల్ నెంబర్ ను టైప్ చేయండి

అమాన్య మొబైల్ నంబర్

download

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాపాలు

రేవంత్ రెడ్డి ప్రభుత్వ నియంత పాలన తెలంగాణ ప్రజల్ని తీవ్రంగా నష్టపరుస్తోంది

  • మూసేసిన చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడంలో విఫలమైన కాంగ్రెస్

    తెలంగాణలో మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని తెరిపించడంలో విఫలమైంది.
  • నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతకు ద్రోహం

    10 లక్షల మంది నిరుద్యోగ యువతకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవ్వడంతో పాటు, తాము ఎన్నికల మేనిఫెస్టోలో అటువంటి ప్రమాణమే చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆరోపించడం శోచనీయం.
  • అంబేడ్కర్ అభయ హస్తం పేరుతో దళితులకు వెన్నుపోటు

    ప్రస్తుత దళితబంధు పథకానికి బదులుగా ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు ఇచ్చే అంబేడ్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, ఆ పథకాన్ని అమలు చేయడంలో విఫలమైంది.
  • ఆర్థిక సాయం అందించకుండా ఆటోడ్రైవర్లను మోసం

    మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించిన తరువాత, ఆటో డ్రైవర్లు తమ రోజువారీ ఆదాయాన్ని కోల్పోయారు. మరోవైపు కాంగ్రెస్ సైతం తమ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లందరికీ సంవత్సరానికి రూ .12,000 ఇస్తామని హామీ ఇచ్చి, చివరకు దాన్ని అమలు చేయడంలో విఫలమై ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైంది.
  • పింఛన్లు పెంచడంలో విఫలం

    వికలాంగులకు రూ.6వేలు, సీనియర్ సిటిజన్లకు రూ.4వేలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ల పెంపులో విఫలమైంది.
  • కళ్యాణమస్తు పథకాన్ని అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్

    కళ్యాణమస్తు పథకం కింద పేద తెలంగాణ మహిళల వివాహానికి రూ.లక్ష, 10 గ్రాముల బంగారం ఇస్తామన్న హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది.
  • విద్యార్థులకు ఉచిత వైఫై అందించడంలో విఫలం

    విద్యార్థులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది.
  • హిందూ పూజారులకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించడంలో విఫలం

    హిందూ దేవాలయాలు, ఆదివాసీలు, గిరిజన పూజారులకు ధూప, దీప నైవేద్యాల కోసం నెలకు రూ.12,000 ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా ఆ హామీని అమలు చేయడంలో విఫలమైంది.
  • ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పేరుతో దగా

    18 ఏళ్లు నిండి విద్యను అభ్యసిస్తున్న యువతులందరికీ ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి, నేడు విఫలమైయ్యారు.

రండి.. ప్రశ్నిస్తున్న తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం

రండి.. ప్రశ్నిస్తున్న తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం

తెలంగాణలో కాంగ్రెస్ సాగిస్తున్న దుష్పరిపాలనకు వ్యతిరేకంగా గళం విప్పండి

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వీడ్కోలు పలికేందుకు ఈ లింక్ ను షేర్ చేయండి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ దుష్పరిపాలనకు సాక్ష్యాలు

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసన గళం

  • ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా జీవనోపాధిని నాశనం చేసి, మమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది

    - పెరిక కృష్ణ, ఆటో డ్రైవర్, సంగారెడ్డి

  • 2 లక్షల రైతు రుణాలు మాఫీ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేశారు.

    - మహేశ్ కుమ్మరి, రైతు, బిచ్కుంద

  • నాలాంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని ఆశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు.

    - మాధవి, విద్యార్థిని, హైదరాబాద్

  • పింఛను రూ.4 వేలకు ఎందుకు పెంచడం లేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ హామీని ఇంకెప్పుడు నెరవేరుస్తారు??? ‘’

    - రాజ్యలక్ష్మి రాథోడ్, పెన్షనర్, మహబూబాబాద్

  • ఈ దోపిడీదారులు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. మేము ఉద్యోగాల కోసం పోరాడుతుంటే, మాలాంటి యువత ఉపాధిపై ఏనాడూ దృష్టి పెట్టలేదు ఈ కాంగ్రెస్.

    - మారుతి మున్నూరు, విద్యార్థి, గజ్వేల్